కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం..

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని దుంపల గూడెం 1 అంగన్వాడి సెంటర్లో సోమవారం కిషోర్ బాలికలకు అంగన్వాడి టీచర్ సిహెచ్ దీప ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ కిశోర బాలికలు తీసుకునే ఆహారం వారి ఆరోగ్యం వారి వ్యక్తిగత పరిశుభ్రత హ్యాండ్ వాష్ తదితర అంశాలపై పూర్తి శ్రద్ధ కనబర్చచాలని అన్నారు. మనం తీసుకునే ఆహారం పోషకాహారం తో సంపూర్ణ ఆరోగ్యం అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా ఇంట్రెస్ట్ తో ఉండాలని అన్నారు. 11 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలు పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య వాణి సరిత ఆశ కార్యకర్త కిశోర బాలికలు పాల్గొన్నారు.

Spread the love