బి.సి గురుకులం అద్దె నూతన భవనం సిద్దం….

– లాంచనంగా ప్రారంభించిన ఎం.పి.పి శ్రీరామమూర్తి.
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గ కేంద్రం అశ్వారావుపేట లో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలుర గురుకులం కోసం అశ్వారావుపేట – భూర్గంపాడ్ రోడ్ లో గల వెంకట దుర్గా శ్రీ గౌతమి పాఠశాల వీధిలో నూతనంగా నిర్మించిన,సిద్దంగా ఉన్న భవనాన్ని ఎం.పి.పి శ్రీరామమూర్తి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహిస్తున్న భవనం అసౌకర్యంగా ఉండటం, విద్యార్థులకు సరిపోక పోవడం తో మరో అద్దె భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి రూ.1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తుందని,కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా సదుపాయాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనీ,తెలంగాణ ప్రభుత్వం అందించే విద్యా వసతులకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలియజేశారు.అలాగే ఈ బిల్డింగ్ నిర్మాణం కొరకు ప్రత్యెక శ్రద్ధ తీసుకున్న పాటశాల ప్రధానోపాధ్యాయులు మంజుల ,ఈ అకడమిక్ ఇయర్ లోనే పాఠశాలను దీనిలో ఏర్పాటు చేయటానికి సకాలంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి అందించినందుకు భవనం యజమాని కంచర్ల భాస్కర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పి.టి.సి భారతి,బీఆర్ఎస్ నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,విద్యార్థి విభాగం కార్యదర్శి సతీష్ రెడ్డి, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శీమకుర్తి సుబ్బారావు,హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నరసింహ రావు,పాటశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love