ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

నవతెలంగాణ- హైదరాబాద్: ఆసియా కప్‌ – 2023కి భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు నేడు న్యూఢిల్లీలో సమావేశమై ఆసియా కప్  కోసం 17 మందితో కూడిన టీమిండియా జట్టును ప్రకటించారు. ఆసియా కప్‌లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ  కెప్టెన్‌గా, హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఐపీఎల్‌లో గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ తాజాగా జట్టులోకి పునరాగమనం చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ సామ్సన్ బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్ వర్మకు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కింది.
జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయష్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిధ్ కృష్ణ, సంజూ సామ్సన్ (బ్యాకప్)

Spread the love