హెల్తీగా, ఫిట్‌గా…

హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. దానికోసం తెగ కష్టపడిపోవాలేమో అనుకుం టారు. కానీ రెగ్యూలర్‌గా మనం కొన్ని ఫాలో అయిహెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. దానికోసం తెగ కష్టపడిపోవాలేమో అనుకుం టారు. కానీ రెగ్యూలర్‌గా మనం కొన్ని ఫాలో అయితే… హెల్తీగా ఉండడమే కాకుండా.. బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వ్యాయామం మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. యాక్టివ్‌గా ఉండడంలో సహాయపడుతుంది. ఎముకలను, కండరాలను ధృడంగా చేస్తుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది. గుండె జబ్బులు, షుగర్‌ వంటి సమస్యలు రాకుండా తోడ్పడుతుంది.
హైడ్రేటెడ్‌గా ఉండండి..
సమ్మర్‌ అయినా కాకున్నా.. నిరంతరం హైడ్రైటేడ్‌గా ఉంటే మంచిది. ఇది కేవలం దాహం తీర్చడమే కాదు.. శరీరం, మెదడును కూడా ఉత్తేజపరుస్తుంది. మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడం, కీళ్లనొప్పులు దూరం చేయడం, శరీరాన్ని డిటాక్స్‌ చేయడం వంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోండి.
బయటకు వెళ్లండి
వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ చేసేవారిలో చాలామంది రూమ్‌లకే పరిమితమైపోతున్నారు. అలాంటివారు కూరగాయల కోసమో.. పెట్స్‌ కోసమో.. లేదంటే ఈవినింగ్‌ వాక్‌ కోసమో బయటకు వెళ్తూ ఉండాలి. ఇది మిమ్మల్ని మానసికంగా ఉత్తేజ పరుస్తుంది. స్వచ్ఛమైన గాలి మీరు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. ఉదయాన్నే విటమిన్‌ డి కోసం ఎండలో కూర్చొన్నా మంచిదే. విటమిన్‌ డి బరువు తగ్గడంలో హెల్ప్‌ చేస్తుంది.
పోషకాలతో నిండిన ఆహారం
హెల్తీగా ఉండడంలో మొదలుకుని.. బరువును అదుపులో ఉంచడంలో బరువు ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా.. బరువును తగ్గించడంలో హెల్ప్‌ చేస్తుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్‌, నట్స్‌, ప్రోటీన్‌ కలిగిన ఫుడ్స్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ వద్దు
పోషకాలు కలిగిన ఫుడ్స్‌ తీసుకోవడం మంచిదే కానీ.. ప్రాసెస్‌ చేసిన వాటితో పోషకాలు పొందాలి అనుకోకూడదు. ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉప్పు, చక్కెర మోతాదుకు మించి ఉంటాయి. ఇలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
నిద్రలేకుంటే ఏమి చేసినా వేస్టే
మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని, బరువును, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది. నిద్రపోయేప్పుడు శరీరం అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తుంది. శారీరక విధులు చేయడం, కండర కణజాలాన్ని సరిచేయడం, మెదడును ప్రాసెస్‌ చేయడం, శక్తిని అందించడం వంటి పనులు చేస్తుంది.

Spread the love