
– ఇంకా కొనసాగుతున్న రెస్కు టీమ్ ఆపరేషన్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ నగరంలోకి ఓ ఎలుగుబంటి అర్ధరాత్రి ప్రవేశించింది శనివారం ఉదయం నుండి రేకుర్తి పరిసరాల్లో జనాలను హాయ్ రానా చేస్తోంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది రెస్క్యూ టీం ఎలుగుబంటి కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు రద్దీగా ఉండే వాడల్లో రెస్క్యూ టీంకు చిక్కకుండా పరుగులు తీస్తోంది. రేకుర్తి శుభం గార్డెన్ సమీపం నుండి ప్రస్తుతం ప్రధాన రహదారి గుండా నగర వీధుల్లో సంచరిస్తోంది. రెస్యూ టీం వరలతో కాపు కాస్తున్న అది చిక్కడం లేదు. వలకు చిక్కకపోతే గంతు మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.