Saturday, May 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసరిహద్దుల్లో 'బెల్ట్‌' దందా..!

సరిహద్దుల్లో ‘బెల్ట్‌’ దందా..!

- Advertisement -

రాత్రి 9 గంటలకే మద్యం దుకాణాల మూసివేత
బెల్ట్‌ షాపుల్లో అర్ధరాత్రిరాత్రి 9 గంటలకే మద్యం దుకాణాల మూసివేత బెల్ట్‌ షాపుల్లో అర్ధరాత్రి అధిక రేట్లకు అమ్మకాలువైన్స్‌లో దొరకని బ్రాండ్లూ లభ్యంమద్యం ప్రియులను దగా చేస్తున్న సిండి’కేటు’లుబీర్‌పై రూ.60.. క్వార్టర్‌పై రూ.50 అదనంపట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాల మద్యం విక్రయాల్లో మాయాజాలం కొనసాగుతోంది. వైన్స్‌ షాపులు, బెల్ట్‌ షాప్‌ల నిర్వాహకులు ఓ అవగాహనతో వ్యవహరిస్తున్నారు. రాత్రి 10 గంటలకు మూయాల్సిన మద్యం దుకాణాలను 9 గంటల్లోపే బంద్‌ చేస్తున్నారు. ఆ వైన్స్‌ షాపులకు ఆనుకొని ఉన్న బెల్టు షాపులు మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాల్లో లభించని బ్రాండ్‌లు సైతం అక్కడ దొరుకుతున్నాయి. అధిక ధరలకు వీటిని విక్రయిస్తుండటంతో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.50, బీర్‌ బాటిల్‌పై రూ.60 అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్స్‌ షాపులు.. బెల్ట్‌ షాపులకు రూ.10 అదనపు ధరకు విక్రయిస్తుంటే.. బెల్ట్‌ షాపులు మాత్రం బాటిల్‌ పరిమాణాన్ని బట్టి రూ.50 నుంచి రూ.250కి పైగా అధిక రేట్లు వసూలు చేస్తుండటం గమనార్హం.

షాప్‌ లేబుల్స్‌ వేసి మరీ..
వైన్‌ షాప్స్‌ నుంచి బెల్ట్‌ షాప్‌లకు మద్యం రవాణా చేయకూడదు. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా బెల్ట్‌ షాపులకు సరుకు విక్రయిస్తున్నాయి. బెల్ట్‌ షాప్‌లు స్థానికంగా ఉన్న మద్యం దుకాణాల మందులు మాత్రమే విక్రయించాలనే కండీషన్‌ మేరకు విక్రయాలు సాగిస్తు న్నాయి. సంబంధిత వైన్స్‌ షాప్‌ లేబుల్స్‌ వేసి మరీ బెల్ట్‌ షాప్‌లకు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్టిక్కర్లు వేసి విక్రయిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం సాధారణం గా అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రామ చంద్రాపురం, వైరా మండలం గన్నవరం – ఏపీలోని నెమలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ దందా నడు స్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ తదితర సరిహద్దు జిల్లాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోందని తెలుస్తోంది. ఏడాది టార్గెట్‌ను ఆరు నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో వైన్స్‌ షాపుల నిర్వాహ కులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నా యి. వైన్స్‌ షాప్స్‌, బెల్డ్‌ షాప్స్‌ నిర్వాహకులు సమన్వయంతో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇలా మందుబాబులను అడ్డం గా దోచేస్తున్నా ఆబ్కారీ శాఖ పట్టించుకునే పరిస్థితి లేదు.

టార్గెట్‌ పేరుతో నిబంధనల ఉల్లంఘన
సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, వైన్‌ షాపులు మద్యం విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. టార్గెట్లే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయి. పెద్దమొత్తంలో మద్యాన్ని బెల్ట్‌ షాప్‌లకు తరలిస్తూ.. రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు ఉదయం 5గంటల నుంచి అర్ధరాత్రి వరకు విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధన ప్రకారం ఉదయం 11గంటలకు తెరవాలి. మైనర్లకు సైతం మద్యం విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బార్‌ అండ్‌ రెస్టారెంట్లో చీప్‌ లిక్కర్‌, ఓఏబీ అమ్మకాలు కొనసాగించరాదు. కానీ కొన్నిచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి చీప్‌ లిక్కర్‌ రూ.110 ఉంటే రూ.140, ఓఏబీ రూ.140 ఉంటే రూ.180కి విక్రయిస్తున్నారు.

నామమాత్రపు చర్యలు
వైన్స్‌ షాప్‌, బెల్ట్‌ షాప్‌ల నిర్వాహకులు ఏకమై ఈ అడ్డగోలు దందా సాగిస్తున్నప్పటికీ ఆబ్కారీ శాఖ అధికారులు నామమాత్రం చర్యలకే పరిమితమైనట్టు గణాంకాలను బట్టి ఆరోపణలొస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఏ-4 షాప్స్‌ మొత్తం 116 ఉండగా, బార్‌ షాప్‌లు మరో 35 ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 7 ఎక్సైజ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 128 కేసులు నమోదవ్వగా.. 134 మందిని అరెస్టు చేశారు. 972 లీటర్ల లిక్విడ్‌, 504 లీటర్ల బీర్‌, 11 వాహనాలను సీజ్‌ చేశారు. ప్రభుత్వ టార్గెట్‌ను పూర్తి చేయడం కోసమే అధికారులు ఇలా నామమాత్రం చర్యలకు పరిమితమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -