Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంహేతుబద్ధ ఆలోచనలకు నిలువుటద్దం భారతీరాజా

హేతుబద్ధ ఆలోచనలకు నిలువుటద్దం భారతీరాజా

- Advertisement -


కళలో సామాజిక చైతన్యం, హేతువాద భావాలను రగిలించిన దర్శకుడు
​సామాజిక కోణంలో తీసిన హిట్ సినిమాలెన్నో..

చెన్నై : సినిమాలు తీయటంలో ప్రతి దర్శకునికీ ఓ శైలి ఉంటుంది. అయితే అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఓ స్టైల్‌‌ను అలవర్చుకున్న భారతీయ సినిమా దిగ్గజం, ప్రముఖ హేతువాద చిత్రాల కోలీవుడ్‌ దర్శకుడు భారతీరాజా పేరు సంపాదించారు. ఆయన మననుంచి దూరమైనా చెరగని ముద్రవేశారు. తమిళనాడు చిత్ర సీమలోనే కాకుండా, యావత్ భారత సినీ పరిశ్రమకు ఆయన భౌతికంగా లేకపోవటం తీరనిలోటని పలువురు సంతాపం తెలిపారు. కేవలం కమర్షియల్ వినోదం కోసం కాకుండా, సమాజానికి సందేశం ఇచ్చేలా సినిమాలను రూపొందించి జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు పొందారు. కథల్లోనే కాకుండా, మేకింగ్‌లో కూడా హేతుబద్ధతను పాటించారు. అప్పటివరకు గ్లామర్ ప్రపంచానికి, ఇండోర్ సెట్లకు పరిమితమైన సినిమాను నిజమైన పల్లెటూరి మట్టిలోకి, సహజమైన వెలుగులోకి తీసుకొచ్చిన విప్లవాత్మక దర్శకుడాయన.

తన సినిమాల ద్వారా “ఆరాధన అనేది కేవలం అభిమానంగానే ఉండాలి కానీ, అది మూఢభక్తిగా మారకూడదు” అని నమ్మి, తన ఫ్యాన్ అసోసియేషన్లను కూడా రద్దు చేయమనడం ఆయన హేతుబద్ధ ఆలోచనకు నిదర్శనమని సీని రంగ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ​దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని స్టూడియోల నాలుగు గోడల నుంచి పల్లెటూరి పచ్చదనం, మట్టి వాసనల వైపు నడిపించిన “రియలిజం పితా మహుడు”, దిగ్గజ దర్శ కుడు, నటుడు భారతీరాజా. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ హేతువాది, దర్శకుడు వేలు ప్రభాకరన్‌ ఆలోచనలు భారతీరాజాతో సహా చాలా మంది దర్శకులకు హేతువాద స్ఫూర్తి నిచ్చాయి. సమాజంలో మూఢ నమ్మ కాలు, కుల వ్యవస్థలను ప్రశ్నిస్తూ.. వాస్తవికత, హేతుబద్ధమైన ఆలోచనలను ఆయన తన జీవితం ద్వారా, ప్రసంగాల ద్వారా ప్రచారం చేశారు. దీనివల్ల స్ఫూర్తి పొందిన భారతీరాజా వంటి ఎందరో సృష్టికర్తలు తమ కళలో సామాజిక చైతన్యాన్ని, హేతువాద భావాలను ప్రతిబింబించారు. దర్శకుడు భారతీరాజా తన సినిమాల్లో కేవలం పల్లెటూరి అందాలనే కాకుండా, అక్కడి సమాజంలో వేళ్లూ నుకున్న మూఢనమ్మకాలు, కుల వివక్ష, లింగ అసమానతలను ప్రశ్నిస్తూ బలమైన హేతువాద, సామాజిక అంశాలను తెరకెక్కించారు.

వేదం పుదిదు సినిమా ఆయన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన రాజకీయ, సామాజిక చిత్రం. మనుధర్మ ఆధిపత్యాన్ని, సమాజంలోని మతపరమైన కపటత్వాన్ని, కుల వివక్షను ఒక చిన్నపిల్లాడి పాత్ర ద్వారా అత్యంత హేతుబద్ధంగా, సూటిగా ప్రశ్నించారు. అలైగళ్ ఓయివతిల్లైలో ఒక హిందూ అబ్బాయి, క్రైస్తవ అమ్మా యి మధ్య జరిగే ప్రేమకథ ద్వారా సమా జంలోని మతాంతర వివాహాల చుట్టూ ఉండే సంకుచితత్వాన్ని, మత పిచ్చిని ఎండగట్టారు. ముదల్ మరియాదై లో శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించగా, సమాజం విధించిన కుల కట్టుబాట్లను దాటి ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తికి, తక్కువ కులానికి చెందిన యువతికి మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని చూపించారు. కరుత్తమ్మలో పల్లె టూళ్లలో జరిగే ‘ఆడ శిశు హత్యా కాండ’ అనే భయంకరమైన సామా జిక ఆచారానికి వ్యతిరేకంగా తీసిన అత్యంత ప్రభావవంతమైన చిత్రం ఇది. ఈ సినిమా ఆ రోజుల్లో సమా జంలో పెద్ద చైతన్యాన్ని తెచ్చింది. సామాజిక స్పృహతో తీసిన సినిమాలకు దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు కూడా లభించింది. ఆయన ప్రతిభకు సాక్ష్యంగా ఆరు జాతీయ చలన చిత్ర అవార్డులు సైతం దక్కాయి.

స్టూడియోల సామ్రాజ్యాన్ని దాటి,,
భారతీరాజా కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్. 1970ల నాటికి సినిమాలు అంటే భారీ సెట్లు, మెలోడ్రామా, కృత్రిమమైన లైటింగ్ మాత్రమే ఉండేవి. కానీ, భారతీరాజా ఆ ఫార్ములాను పూర్తిగా బద్దలు కొట్టారు. అవుట్‌డోర్ షూటింగ్స్, సహజమైన పల్లెటూరి పాత్రలు, కమర్షియల్ హంగులు లేని ప్యూర్ ఎమోషన్స్‌తో ఆయన సరికొత్త సినిమా స్కూల్‌ను సృష్టించారు.

భారతీరాజా మృతికి సీపీఐ(ఎం) సంతాపం
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌: భారతీయ చలనచిత్ర రంగానికి, తమిళ సినిమాకు కొత్త ఒరవడిని పరిచయం చేసిన ప్రముఖ దర్శకులు, నటులు భారతీరాజా మరణం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. బుధవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ​సినిమా అంటే కేవలం స్టూడియో సెట్లు, కల్పిత ప్రపంచం మాత్రమే కాదనీ, అది మట్టి వాసనతో కూడిన పల్లెటూరి జీవితం, సామాన్య ప్రజల భావోద్వేగాలు, సామాజిక వాస్తవికత అని తనదైన శైలిలో భారతీయ రాజా నిరూపించారని కొనియాడారు. దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా ఆయన తన ప్రత్యేక ముద్రను వేశారనీ, ‘16 వయదినీలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో మొదలుకొని ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు గ్రామీణ జీవితాన్ని, కుల వివక్ష వంటి సామాజిక సమస్యలను అత్యంత సహజంగా, కళాత్మకంగా ఆవిష్కరించాయని గుర్తుచేశారు. సినిమాను సామాజిక మార్పునకు ఒక మాద్యమంగా భావించి కొత్త తరానికి ఆయన బాటలు వేసారనీ. అనేక మంది ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేశారని తెలిపారు. అనేక జాతీయ, తమిళనాడు రాష్ట్ర అవార్డులు అందుకున్న ఆయన మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -