Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్వాంటమ్‌స్కేప్‌ కార్యాలయాన్ని సందర్శించిన భట్టి

క్వాంటమ్‌స్కేప్‌ కార్యాలయాన్ని సందర్శించిన భట్టి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం సాన్ జోస్‌లోని బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్‌స్కేప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ అధ్యక్షులు శివరామ్ ఇతర ఉన్నతాధికారుల బృందంతో భేటీ అయ్యారు. బ్యాటరీ సాంకేతికతలు, గ్లోబల్ సప్లై చైన్, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. సాంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీల కంటే అత్యంత సురక్షితమైన, ఎక్కువ శక్తి నిల్వ సామర్థ్యం గల ‘సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్’ బ్యాటరీల అభివృద్ధిని క్వాంటమ్‌స్కేప్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని డిప్యూటీ సీఎంకు వివరించారు.
రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ, ఇంజినీరింగ్ ప్రతిభ, స్వచ్ఛ ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా భట్టి వారికి వివరించారు. ఆర్అండ్‌‌డీ, విడిభాగాల తయారీని తెలంగాణలో విస్తరించే అవకాశాలను పరిశీలించాలని క్వాంటమ్‌స్కేప్‌ ప్రతినిధులను భట్టి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -