Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజు రీయింబర్స్‌‌మెంట్‌, స్కాలర్‌‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌, స్కాలర్‌‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

- Advertisement -

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
13న కలెక్టరేట్ల ఎదుట ధర్నా
పోరాటాన్ని ఉధృతం చేస్తాం
పోస్టరావిష్కరణలో ఎస్‌ఎఫ్‌‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పెండింగ్‌లో ఉన్న రూ. 10,814 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ల బకాయిలను రాష్ట్ర సర్కారు వెంటనే విడుదల చేయాలనీ, ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రయివేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ఈ నెల 13న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎఫ్‌‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్‌‌ను సోమవారం హైదరాబాద్‌‌లోని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.మమత, డి.కిరణ్‌, కె.అశోక్‌‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చిన లెనిన్, హైదరాబాద్ జిల్లా నాయకులు ప్రశాంత్, శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌, స్కాలర్‌‌షిప్‌‌ బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఆ భారాన్ని విద్యార్థులపైనా, వారి తల్లిదండ్రులపైనా మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ను విద్యార్థుల నుంచి కొన్ని ప్రయివేటు కళాశాలలు బలవంతంగా వసూలు చేయడాన్ని తప్పుబట్టారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీలు, మెమోలు, ఇతర విద్యా పత్రాలను కళాశాలలు తమ వద్ద ఉంచుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సర్టిఫికెట్లను షరతులు లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఏటా వాటిని విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేసే విధంగా శాశ్వతమైన నిధుల విడుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -