భోళా మానియా మొదలైంది

చిరంజీవి ప్రస్తుతం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భోళా మానియా ఈనెల 4న విడుదలయ్యే మొదటి సింగిల్‌తో ప్రారంభమవుతుంది. చిరంజీవి అల్ట్రా-మోడ్రన్‌ అవతార్‌లో ఉన్న స్టైలిష్‌ పోస్టర్‌ ద్వారా మేకర్స్‌ అనౌన్స్‌ చేసినట్లు నేడు (శుక్రవారం) పాట ప్రోమోను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. జూన్‌ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్‌ కనిపించనుంది. సుశాంత్‌ ఈ సినిమాలో లవర్‌ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.రఘుబాబు, రావు రమేష్‌, మురళీ శర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌, ప్రభాస్‌ శీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేష్‌, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, సంగీతం: మహతి స్వర సాగర్‌, డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, కథా పర్యవేక్షణ: సత్యానంద్‌, డైలాగ్స్‌: తిరుపతి మామిడాల, ఫైట్‌ మాస్టర్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కాచే కంపాక్డీ, కొరియోగ్రఫీ: శేఖర్‌ మాస్టర్‌.

Spread the love