నిజామాబాద్ నగరం లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల బైక్ ర్యాలీ

– కదిలిన గులాబీ సైన్యం

– పుర వీధులన్నీ గులాబీ మయం
– ఉత్సాహం నింపిన బైక్ ర్యాలీ
– జోష్ లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
నవతెలంగాణ కంటేశ్వర్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ నుండి ఫులాంగ్, ఆర్.ఆర్.చౌరస్తా, వర్ని చౌరస్తా, ఖిల్లా రోడ్, నెహ్రు పార్క్, గాంధీ చౌక్, దేవి రోడ్, శివాజీ చౌక్, సంజీవయ్య కాలనీ మీదుగా సుభాష్ నగర్ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్ , బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవి చందర్, సత్య ప్రకాష్,సిర్ప రాజు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love