– బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ప్రజల్లో విసుగు
– బండి సంజయ్ వాఖ్యాలను
– తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్‌నగర్
ప్రభుత్వ రంగ సంస్థలను లూటీ చేసి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం దోచిపెడుతుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు నష్టం కలిగించే చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దానికి బిఆరెస్ పార్టీ వత్తాసు పలుకుతుందని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటి కాదని, బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటి అని నిరూపించుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న క వితను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడమే బీజేపీ, బీఆ ర్‌ఎస్ ఒక్కటి అనడానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలని ఇష్టానుసారంగా అమ్ముతున్న ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. దేశం లో జరిగే అన్యాయాలను ప్రజలు చూస్తున్నారని, ఆర్థిక వ్య వస్థను లూటీ చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచ ేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రాహుల్ గాంధీ కుల, మతాలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యకూమారి వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారని దాని ఫలితమే కర్నాటక విజయమని వివరించారు. కర్నాటకలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులను ఎన్నో ప్రలోభాలకు గురి చేసినకూడా అన్ని ఓర్చి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని తెలిపారు. రాజీవ్ గాంధీ కాలంలో ప్రజల్లో కాంగ్రెస్‌కు ఎలా మద్దతు ఉందో అదేవిధంగా ప్రస్తుతం రాహుల్ గాంధీకి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటని చెప్పడం దిక్కుమాలిన చర్య అని అన్నారు. సబ్బండ కులాలన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల పై విసుగు చెందాయని, త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెపుతారని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ గల్లీలలో గొడవలు పడి, ఢిల్లీలో మాత్రం కలిసే ఉంటాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను ప్రజలు చూస్తున్నారని త్వరలోనే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బాబర్‌ఖాన్, పార్టీ మం డల అధ్యక్షులు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రఘు, పురు షోత్తంరెడ్డి, ఎంపీటీసీ కావాలి శ్రీశైలం, హాజీపల్లి ఉపసర్పం చ్ సుదర్శన్, శ్రీనునాయక్, ఖదీర్, ముబారక్ అలీఖాన్, చంద్ర శేఖర్, కొందుర్గు మం డల అధ్యక్షులు కృష్ణారెడ్డి, గంగమోని సత్తయ్య, మానపాటి ప్రదీప్, అశోక్, శ్రీనివాస్, బుడ్డ నర్సింహ పాల్గొన్నారు.