రాజస్థాన్‌లో బీజేపీ ఐదో జాబితా

జైపుర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మావ్లీ (ఉదరుపుర్‌) నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధర్మనారాయణ్‌ను కాదని, ఆయన స్థానంలో కేజీ పలివాల్‌ను బరిలోకి దింపింది. సివిల్‌ లైన్స్‌ నుంచి గోపాల్‌ శర్మ, ఆదర్శ్‌నగర్‌ నుంచి రవి నాయ్యర్‌లకు టికెట్లు కేటాయించింది. వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ నెల 2న మూడో జాబితాలో మాజీ మంత్రి దేవీసింగ్‌ భాటి కోడలు పూనమ్‌ కన్వర్‌ భాటికి కొలాయత్‌ నియోజకవర్గ టికెట్‌ కేటాయించింది. ఆదివారం జాబితాలో ఆ పేరును తొలగించి.. ఆమె కుమారుడు అంశుమాన్‌ సింగ్‌ భాటికి అవకాశం ఇచ్చింది. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటివరకు బీజేపీి 198 మంది పేర్లను ప్రకటించింది. సోమవారంతోనే నామినేషన్ల గడువు ముగియనుంది.

Spread the love