అందరికీ ఆదర్శమూర్తి బీఆర్‌ అంబేద్కర్‌

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
కుల మత ప్రాంతీయ రాజకీయాలను కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం వారి పద్దతులను మార్చుకుని నూతన పార్లమెంట్‌ పేరును అంబేద్కర్‌ నామకరణం చేస్తూ రాష్టప్రతిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిం చాలని ప్రజ్షా సంఘాల జేఏసీ చైర్మెన్‌ గజ్జలకాంతం డిమాండ్‌ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ సంఘాల నాయకు లతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు, నూ తన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు నామకరణం చేశార ని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు బహుజనులు, బడుగు, బలహీన వర్గాలు అండగా ఉంటామన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం రాయకపోతే తాను ప్రధానిని కాలేనని చెప్పిన ప్రదాని నూతన పార్లమెంట్‌ భవనానికి ఆయన పేరు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గిరిజన ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశామని గొప్పలు చెప్పుకున్న వారు ఆమె ను పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వాని చడం లేదో సమాధానం చెప్పాలన్నారు. నియంత పాలను అంతం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగా ణలో అధికారం పగటి కలే అనీ, కర్ణాటకలో మీరు చేసిన పాలన ప్రజలు చూశారన్నారు. గుజరాత్‌లో ఆడబిడ్డలు కనిపించకుండా పోయిన ఘటనపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యో గాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. హిందూ దేవతల పేర్లతో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రయివేటు ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్‌, డాక్టర్‌ సంజు నాయక్‌, ఇష్టమని పూసల సంఘం సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షులు కోనేటి సత్యం, మున్నూరు కాపుల సంఘం రాష్ట్ర అధ్యక్షు రాలు గుంటి మంజులరాణి, తెలంగాణ వడ్డెర సంఘం అధ్యక్షులు దండగుల రామకృష్ణ, పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love