బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలి

– రెజ్లర్లపై లైంగికవేధింపులకు నిరసనగా 7న మండల కేంద్రాల్లో నిరసనలు
– 13న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారత దేశానికి బంగారు పతకాలను తీసుకొచ్చి, దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలిండియా ఫెడరేషన్‌ అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. రెజ్లర్లపై పోరాటంపై నిర్బంధాన్ని ఖండిస్తూ ఈ నెల ఏడో తేదీన మండల కేంద్రాల్లో నిరసనలకు, 13న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈమేరకు సోమవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రెజ్లర్లు 40 రోజులకుపైగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పోరాటం చేసినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.

Spread the love