– డబ్బున్నోడికి ఓట్లు వేయకండి
ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తిని గెలిపించండి
– బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ముందు ఎంపీలుగా చేసి ఏం అభివృద్ధి చేశారు
– ప్రజలు ఆలోచించండి
– సింహం గుర్తుకు ఓటు వేసి గుర్రపు మచ్చేందర్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
నవతెలంగాణ – మద్నూర్
జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్రపు మచ్చేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ప్రచార రథంతో మద్నూర్ మండల కేంద్రానికి చేరుకొని మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో పార్లమెంట్ ఎన్నికల పట్ల ప్రసంగించారు. డబ్బున్నోడికి గెలిపించుకుంటే అలాంటి వ్యక్తులు డబ్బు సంపాదనకే మొగ్గు చూపుతారని, ప్రజా సమస్యలు పట్టించుకోరని, ఇంతకుముందు ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఎంపీగా గెలుపొంది జహీరాబాద్ పార్లమెంటుకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, అలాంటి వ్యక్తులు మళ్లీ పోటీ చేస్తున్నారని, పని చేసే వ్యక్తిని గుర్తించి ఎంపిగా గెలిపించాలని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలాంటి వ్యక్తికి గెలిపించుకుంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, జహీరాబాద్ పార్లమెంట్ ఎంతో వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని, నిరుద్యోగ సమస్య తీరుస్తానని తెలిపారు. సింహం గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్రపు మచ్చేందర్ పార్టీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రసంగం ప్రజలకు ఆకట్టుకుంది.