గడ్డపార చేతపట్టి.. ప్రచారం చేపట్టి…

– పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే పట్టం కట్టాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పెద్దవంగర
గడ్డపార చేతపట్టి, ప్రచారం చేపట్టి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ‌‌‌‌ పాల్గొని, కాంగ్రెస్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ఆగస్టు 15 లోపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని చెప్పారు. గతంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ కే దక్కిందని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నెల రోజుల్లో ఆసరా పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గానికి చేసింది శూన్యం అని విమర్శించారు. అందుకే పాలకుర్తి ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. అదే రీతిలో కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. బీజేపీ తో దేశానికి ప్రమాదకరమని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. జీఎస్టీ పేరుతో దేశ ప్రజలను బీజేపీ సావకొడుతుందని, నిత్యవసర ధరల పెరుగుదలకు బీజేపీయే కారణం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, దుంపల కుమారస్వామి, పొడిశెట్టి సైదులు గౌడ్, రంగు మురళి గౌడ్, బీసు హరికృష్ణ గౌడ్, చిలుక దేవేంద్ర, బెడద మంజుల, ఎంపీటీసీ మెట్టు సౌజన్య నగేష్, బానోత్ గోపాల్ నాయక్, దాసరి శ్రీనివాస్ సమ్మయ్య, ఆవుల మహేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love