విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా హాస్టల్ సెలవులను రద్దు

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో జూన్ 1 నుండి 9 వరకు హాస్టల్ లకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ సెలవులు ప్రకటించారు.‌ తిరిగి తాత్కాలికంగా హాస్టల్ సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తాత్కాలికంగా కాదని సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, అధికారికంగా సర్కులర్ జారీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్ , శివ డిమాండ్ చేశారు. శుక్రవారం వీసీ ఛాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు అధికారికంగా సర్కులర్ ఇచ్చేదాకా చాంబర్ నుండి కదలమని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. వైస్ ఛాన్సలర్ కు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీ లో జరుగుతున్న అక్రమాలను వెలికి తిస్తున్నందుకు గాను ఉద్యమాన్ని ఆపడానికి హాస్టల్ కు కావాలని సెలవులు ఇచ్చారని, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డంకులు సృష్టించిన, కేసులు పెట్టిన అవినీతి ,అక్రమాలపై మా పోరాటం ఆగదని, విద్యార్థులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, సాయి తేజ ,రమేష్ , నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love