‘ కుల ‘.. రాజ.. కీయాలు

నవతెలంగాణ -మోపాల్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది  ఎలక్షన్ సమయం ఆసన్నమైనందున వివిధ రాజకీయ నాయకులు కుల రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఒకప్పుడు మనమంతా ఒకటే కులం అనే సిద్ధాంతం నుంచి కేవలం మతాల వారిగా చూసే రాజకీయాలు నుండి  ప్రస్తుత సమాజంలో కులాల మధ్యన చిచ్చు పెడుతూ వారి రాజకీయ స్వార్థం కోసం విభజించు పాలించు అనే నినాదంతో కులాల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఓటర్ కి డబ్బు రూపాన మరియు  మందు రూపాన వస్తువుల రూపాన తాయిలాలు ప్రకటించే రాజకీయ పార్టీలు ప్రస్తుతం కొత్త ట్రెండ్ ని ఫాలో  చేస్తున్నారు.
భారతదేశమంటే అన్ని కులాల సమ్మేళనమే..
(భిన్నత్వంలో ఏకత్వం) అని ప్రపంచ దేశాలు అంటుంటే ,కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం కులాలని విభజిస్తున్నారు, మొత్తం ప్రజానీకానికి ఇన్ని నిధులు ఇచ్చామని చెప్పకుండానే, మీ కులానికి ఇన్ని నిధులు ఇచ్చాం మీ కులానికి ఇన్ని కమ్యూనిటీ హాల్ మంజూరు చేసామని మనలో మనకే చిచ్చు పెడుతూ వారి ఓటు బ్యాంకు కోసం మనల్ని వాడుకుంటున్నారు. నవ సమాజ నిర్మాణం అంటే కుల నిర్మూలననీ అంతమొందించటం అని, కానీ ఇటీవల కాలంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ, రెడ్డి కుల సమ్మేళనమని ,అలాగే దళితుల సమ్మేళనమని ,పద్మశాలి సమ్మేళనమని మనల్ని విడదీస్తున్నారు. మనమంతా మనుషులమనే మరిచిపోయే విధంగా వారు తయారు చేస్తున్నారు. కేవలం కులాల నుండి ఓట్లు దండుకునే విధంగా మీ కులాలకు అది చేస్తామంటూ ఇది చేస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుల విభేదాలు సృష్టిస్తున్నారు,  మనమంతా భారతీయులమని మన కులం భారత కులమని మర్చిపోయే విధంగా ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా తమ టికెట్ ఇచ్చే కాండేట్లను కూడా కులాల ప్రాతిపదికన  టికెట్లు కేటాయించడం గొప్ప విషయం, వారి గుణగణాలను పట్టించుకునే నాధుడే లేడు కనీసం వారిపైన సివిల్ గాని క్రిమినల్ కేసులు ఉన్నాయ అని కూడా అవసరం లేదు. యే  నియోజకవర్గంలో ఏ కులం వారు అత్యధికంగా ఉన్నారు. ఆ కులానికి సంబంధించిన నాయకుడికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.  వారికి టికటిస్తే మన పార్టీకి విజయం వరిస్తుంద లేదా అనే ఒక మూఢనమ్మక సిద్ధాంతంతోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇదేనా మన బావి భారత తరాలకు ఇచ్చే కుల రాజకీయాలు, ఆఖరికి చదువుకునే పిల్లలకు సైతం కులాన్ని అంటగట్టి తమ రాజకీయ స్వార్థాల కోసం వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది మేధావులు ఈ కులాల పైన చర్చలు జరుగుతున్నా కూడా యే మాత్రం మార్పు సంభవించడం లేదు. ఇంకా ఎలక్షన్ సమయంలో మరి అనాగరికంగా వ్యవహరిస్తున్నారు, ఒకప్పుడు ధనార్జన రాజకీయాలనుంచి కుటుంబ పాలన రాజకీయాల నుండి ప్రస్తుతం కుల రాజకీయాలకు దారితీస్తుంది, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు మన స్వాతంత్ర సమర యోధులు కులాల ప్రకారము స్వాతంత్రం తీసుకు రాలేదన్న విషయాన్ని ప్రస్తుత రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు .మనమంతా భారతీయులం భరతజాతి బిడ్డలం అనే నినాదం అడుగంటుక పోతుంది. ప్రస్తుత 2023 తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు మొత్తం విజయ అపజయాలు కులాలపైనే  అనీ అంచనాలు వేస్తున్నారు. కులాలు అంటే రాజకీయం రాజకీయం అంటే కులం అనే దీనస్థితికి ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోతున్నయీ. తెలంగాణ రాష్ట్రo ఏర్పాటుకు ముందు పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దారుణంగా కుల రాజకీయాలు చేయలేదని, అలాగే విభజించు పాలించు అనే సిద్ధాంతంతోనే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో నడుపుతున్నారని మేధావులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్లో గుణం చూస్తే ఓట్లు రావని కులం చూస్తేనే ఓట్లు వస్తాయని మూఢ సిద్ధాంతంతో దీనస్థితికి రాజకీయాలు దిగా జారిపోతున్నాయి. ఇప్పుడు కూడా స్వాతంత్రంలో పాల్గొన్న గాంధీజీ, నెహ్రూ లాంటి మహనీయులు ఉండి ఎలక్షన్లో పోటీ చేస్తే కూడా ఇతను మా కులం వాడు కాదు మేము ఓట్లు వేయం అనే దీనస్థితిలో కి ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయినాయి. తమ ఆరోగ్యం బాగోలేని ప్రాణాపాయ స్థితిలో ఉంటే తమకు వైద్యం చేసే డాక్టర్ మాత్రం యే కులం వాడైనా పర్వాలేదు .కానీ ఐదు సంవత్సరాలు మనల్ని రూల్ చేసే నాయకుడు మాత్రం మన కులం వాడై ఉండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణలో మాత్రం కుల రాజకీయాలపై గెలుపోటములు ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పటికైనా యువత మేలుకోండి కులం కాదు మనకు మన ఐదు సంవత్సరాలు బాగుపరిచే నాయకుడు కావాలి. ఓటు కోసం ఇచ్చే 500 రూపాయలు, ఓటుకు ఇచ్చే సారా బాటిల్ మనకు అవసరం లేదు .మన గల్లీలో రోడ్లు వేసి నాయకుడు కావాలి, ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కావాలి. అటువంటి వారికి ఓట్లు వేసి గెలిపించాలని కొందరు ప్రజల సైతం కూడా బహిరంగంగా వేడుకుంటున్నారు. కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, లేని నవ సమాజ నిర్మాణం ఏర్పాటు కావాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలో అని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా యువత మేలుకో ప్రశ్నించే తత్వం అల వర్చుకో, నవ సమాజ నిర్మాణానికి భాగస్వామ్యుడు అవ్వాలని కోరుకో..
Spread the love