ఘనంగా కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు అంగరంగవైభవంగా శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పేదలకు పండ్లు,స్విట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య, వాసవి క్లబ్ నాయకులు కుక్కడపు అశోక్,రేపాల దనేంజయులు,రేపాల హరీష్,కుక్కడపు వెంకటేశ్వర్లు,సత్యనారాయణ, ఓల్లాల రమేష్,ప్రసాద్,నాగరాజు,కోడీమ్యాల భాస్కర్,శివ పాల్గొన్నారు.
Spread the love