కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నవతెలంగాణ-గోవిందరావుపేట
దేశవ్యాప్తంగా తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో పీఎస్ఆర్ కళ్యాణ మండపంలో బిజెపి మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణవేణి హాజరై మాట్లాడారు. జన సంపర్క్ అభియాన్ మే 30 నుంచి జూన్ 30 వరకు జరిగే కార్యక్రమంలో మండల కమిటీ శక్తి కేంద్ర ఇంచార్జ్ లు బూత్ కమిటీల అధ్యక్షులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో 9 సంవత్సరాల నరేంద్రమోడీ పరిపాలనా, సంక్షేమ పథకాలను ,ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేక గాలి వీస్తోందని బిజెపి పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చౌగాని స్వప్న జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారపు సురేష్ ,సీనియర్ నాయకులు , సూరపనేని వెంకట సురేష్, కొత్త సుధాకర్ రెడ్డి ,యార్లగడ్డ నాగేశ్వరరావు , మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు అంతి రెడ్డి రమాదేవి ,దావుల స్వప్న , మండల ఉపాధ్యక్షుడు బూర్గుల చంద్రమౌళి, మూల కుమార్ , రాజారపు రామచంద్రు ,మండల శ్రీకాంత్, బర్ల సంజీవరెడ్డి, వద్దుల వీరేందర్ మండలంలోని అన్ని బూత్ అధ్యక్షులు ఇన్చార్జీలు మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love