కంటేశ్వర్ లో శ్రీ కృష్ణుడు గోపిక వేషధారణలో అలరించిన చిన్నారులు

నవతెలంగాణ – కంటేశ్వర్

నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ విద్యుత్ నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరి చిన్నారులు అక్క చెల్లెలు చైత్ర సరయు గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారి వేషాధారణలో అలరించారు. చూసిన స్థానికులు ఎంతో ఇష్టంతో వీక్షిస్తూ వారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు చిన్నారులతో ఫోటోలు దిగుతూ అలాగే చిన్నారులను ఫోటోలు దించుతూ తమ సంతోషం వ్యక్తం చేసుకున్నారు. తమ ఇంటి వద్ద ఎంతో ఘనంగా చేసుకున్నందుకు వారు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా ప్రజలతోపాటు నవ తెలంగాణ బృందానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love