కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడేది సీఐటీయూ
ఈ విజయం కార్మికులకే అంకితం
పరిశ్రమలో చారిత్రాత్మక వేతన ఒప్పందం చేస్తాం: సీఐటీయూ
రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి పట్టణంలోని వరుణ్ దేవారైజెస్ పెప్సీ పరిశ్రమలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు హెచ్‌ఎంఎస్ రాష్ట్ర నాయకులు సదానందం పై ఘనవిజయం సాధించారు. కంపెనీలో మొత్తం 191 ఓట్లు ఉండగా సీఐటీయూకు 114 ఓట్లు, హెచ్‌ఎంఎస్ కు 77 ఓట్లు వచ్చాయి. హెచ్‌ఎంఎస్ పై సీఐటీయూ 37 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. సీఐటీయూ విజయం పట్ల కార్మికులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ ఈ విజయం కార్మికులకు అంకితం అన్నారు. హెచ్‌ఎంఎస్ యూనియన్ అనేక ప్రలోభాలకు గురిచేసినా యాజమాన్యం బెదిరించినా కార్మికులు ఐక్యతతో సీఐటీయూకు పట్టం కట్టారన్నారు. ఈ విజయంతో పరిశ్రమలో మెరుగైన వేతన ఒప్పందం సాధిద్దామని, పరిశ్రమలో అన్నింటికన్నా మెరుగైన వేతన ఒప్పందం సాధించి పెడతానని భరోసా ఇచ్చారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంలోని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేస్తూ అండగా నిలుస్తున్న జెండా సీఐటీయూ మాత్రమే అన్నారు. కార్మికులు ఎంతో ఐక్యతతో సీఐటీయూను గెలిపించారన్నారు. కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉంటూ అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, కార్యదర్శి జి.సాయిలు, యూనియన్ జనరల్ సెక్రెటరీ భీమ్ రెడ్డి నాయకులు శివ, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెప్సీ కంపెనీలో సీఐటీయూ విజయకేతనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



