ముదిరాజ్ లను అవమానపరిచిన సీఎం కేసీఆర్

– తెలంగాణ ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్
నవతెలంగాణ -తాడ్వాయి
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముదిరాజులను అవమానపరిచి, చిన్నచూపు చూస్తున్నాడని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని లేఖర్లతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రభుత్వం ముదిరాజ్ కులాన్ని అవమానించిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించిన రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసే జాబితాలో ముదిరాజ్ కులాన్ని పొందపర్చకపోవ డంలో ఆంతర్యం ఏమిటని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ ప్రశ్నించారు. ముదిరాజ్ లు బీసీ కులాల్లో లేరా.. ముదిరాజ్లకు కుల వృత్తి లేదా అని ప్రశ్నించారు. వృత్తిదారులకే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం స్వాగతనీయమని, అందులో ముదిరాజ్లను విస్మరించడం ఎంత వరకు సబబని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అధిక ఓటింగ్ శాతాన్ని కలిగి ఉన్న ముదిరాజ్లను బీసీ సంక్షేమ శాఖ ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదో సమాధానం చెప్పాలని అన్నారు. రూ. లక్షసాయం అందించే కులాల జాబితాలో వెంటనే ముదిరాజ్ కులాన్ని కూడా చేర్చి ఉత్తర్వులు జారీ చేయాలనీ, వెంటనే సవరింపు ఉత్తర్వులు జారీచేయకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప డుతామని హెచ్చరించారు. గ్రామాల్లో ముదిరాజ్లకు కనీసం చేపల వేటకు వెళ్లడానికి కావాల్సిన పరికరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మండిపడ్డారు. ముదిరాజ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కావాలనే జాబితా లో చేర్చలేదని విమర్శించారు. ఏ స్థాయిల తప్పిదం జరిగిందో సమీక్షించి వెంటనే ముదిరాజ్లకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం అందించేలా నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

Spread the love