సీఎం తల తెగ నరుకుతా !..

– బెదిరించినోడికి బీజేపీ టిక్కెట్‌
– శివమొగ్గ నుంచి చెన్నబసప్ప పోటీ
– మాజీ మంత్రి ఈశ్వరప్ప కుమారుడికి మొండి చేయి
బెంగళూరు: బీజేపీకి ఎలాంటి వ్యక్తులు కావా లో, దాని భావజాలమేంటో మరోమారు ప్రస్ఫుట మైంది. శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎస్‌ఎన్‌ చెన్నబసప్పకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చింది. అయితే చెన్నబసప్ప 8 ఏండ్ల కింద ట నాటి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తల ను తెగ నరుకుతా అంటూ బెదిరింపులకు పాల్పడి అప్పట్లో అరెస్టు కూడా అయ్యారు. ఇప్పుడు అదే చెన్న బసప్ప మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివ మొగ్గ నుంచి బీజేపీ తరపున బరిలో నిలుస్తుం డటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 59 ఏండ్ల వయస్సున్న చెన్నబసప్ప అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం బీజేపీ అధినాయ కత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. నామిషనేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన గురువారం నాడు ఆయన తన నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప తదిరులతో కలిసి ర్యాలీగా వెళ్లి చెన్నబసప్ప నామినేషన్‌ పత్రాల ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.
ఈశ్వరప్ప ఆశలు అడియాసలు
ఎన్నికల రాజకీయాల నుంచి తాను వైదొలుగు తున్నట్లు ఈ నెల 11న ఈశ్వరప్ప ప్రకటించారు. అయితే ఆయన తన స్థానంలో తన కుమారుడు కెఇ కంతేశ్‌కు బీజేపీ టిక్కెట్‌ ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధినాయకత్వం ఆయనకు మొండి చేయి చూ పింది. ఆయన ఆశలపై నీళ్లు కుమ్మరించి వివాదస్ప దుడైన చెన్నబసప్పకు పచ్చజెండా ఊపింది. టిక్కెట్‌ కావాలంటే ‘తల తెగ నరుకుతా’ అని బెదిరించి సమ ర్థత చాటుకోవాలా? అంటూ స్వపక్షంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్య మంత్రి జగ దీశ్‌ శెట్టార్‌ వంటి సీనియర్‌ నేతలకు టిక్కెట్‌ నిరా కరించడంతో వారంతా తిరుగుబాటు జెండా ఎత్తి కాంగ్రెస్‌, తదితర పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే.
చెన్నబసప్ప నేపథ్యం..
చెన్నబసప్ప శివమొగ్గ సిటీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు, ఆ తర్వాత శివమొగ్గ సిటీ కార్పొరేషన్‌కు అనేక పర్యాయాలు ఎన్నికయ్యారు. విశ్వ హిందూ పరిషత్‌, భజ్‌రంగ్‌ దళ్‌ వంటి హిందూత్వ సంస్థల్లో చెన్నబసప్ప క్రియాశీలకంగా ఉంటూ ఇతర మతాల పట్ల విద్వేషాన్ని వెళ్లగక్కుతూ ఉంటారన్న విమర్శలు ఆయనపై మొదటి నుంచీ ఉన్నాయి. 2015 నవంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గోమాంసం (బీఫ్‌) వినియోగంపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూత్వ సంఘాలు ఒక నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో చెన్న బసప్ప కూడా పాల్గొన్నారు. శివమొగ్గలో బీఫ్‌ వినియోగిస్తే దానికంటే ముందుగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తలను నరికేస్తానని చెన్నబసప్ప తీవ్రమైన హెచ్చరికలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ శివమొగ్గ శాఖ అధ్యక్షులు పివి విశ్వనాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత ప్రాతిపదికన వైషమ్యాలు సృష్టించి ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు కుట్ర పన్ను తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చెన్నబసప్పను అదే ఏడాది నవంబరు 3న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై ఆయనను విడుదల చేశారు. అసక్తికరమైన విషయమేమిటంటే తీవ్రమైన బెదిరింపులకు పాల్పడిన చెన్నబసప్పతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో నాట కాలు ఆడింది. అనంతరం జరిగిన ప్రతి హిందూత్వ ర్యాలీల్లోనూ, సమీకరణల్లోనూ చెన్నబసప్ప క్రియా శీలంగా వ్యవహరిస్తూవచ్చారు. ఇప్పుడు అదే చెన్న బసప్పకు బీజేపీ టిక్కెట్‌ ఇవ్వడం లౌకిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్‌ అనం తరం చెన్నబసప్ప మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తప్ప కుండా విజయం సాధిస్తానని తెలిపారు. కనీసం 60 వేల మెజార్టీతో తాను గెలుపొందుతానని చెప్పారు.
కనీసం కారు లేదట!
బీజేపీ అభ్యర్థిగా శివమొగ్గ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా చెన్నబసప్ప తన ఆస్తీపాస్తుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను 9వ తరగతి వరకే చదువుకున్నట్టు తెలిపారు. తనకు, తన భార్యకు కలిసి రూ.1.05 కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. దంపతులిద్దరికీ కలిసి మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, అయితే కారు మాత్రం లేదని ప్రకటించారు.

Spread the love