‘హరీష్‌ అన్నా సేవా సమితి’ పేరుతో వసూళ్లు

– ప్రముఖులు విరాళాలిచ్చారంటూ ప్రచారం
– పలువురు నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూళ్లకు స్కెచ్‌
– ఇద్దరు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సులువుగా డబ్బులు సంపాదిం చాలని ఆలోచించిన ఇద్దరు నిందితులు ఏకంగా ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ పేరుతో ‘హరీష్‌ అన్నా సేవా సమితి’ పుస్తకాన్ని ప్రింట్‌ చేశారు. విరాళాల పేరుతో పలువురి నుంచి వసూళ్లకు పాల్పడుతు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ‘హరీష్‌ అన్నా సేవా సమితి’ పేరుతో వున్న పుస్తకాన్ని, రిసిప్ట్‌ బుక్‌ను స్వాధీ నం చేసుకున్నారు. బుధవారం డీసీపీ పీ.రాధాకిషన్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌కు చెందిన పేరాల వెంకటేష్‌ అలి యాజ్‌ తెలంగాణ వెంకటేశ్వరా రావు, వెంకట్‌, గండిమె ౖసమ్మకు చెందిన గడ్డమీది రాజేష్‌ కుమార్‌ సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. ఫైనాన్స్‌ అండ్‌ హెల్త్‌ మినిస్టర్‌ హరీశ్‌రావుకు సంబంధించిన సామాజిక కార్యకలాపాలను తెలుసుకునేవారు. మంత్రి ఫాలోవర్స్‌గా ప్రచారం చేసుకున్నారు.’హరీష్‌ అన్నా సేవా సమితి’పేరుతో ఓ సంస్థను 2016లో కూకట్‌పల్లి, వివేకానందా కాలనీ అడ్రస్‌తో రిజిస్ట్రర్‌ చేశారు. అనంతరం షాపూర్‌లోని లక్ష్మి ప్రిటింగ్‌ ప్రెస్‌లో ‘హరీష్‌ అన్నా సేవా సమితి’కి వెంకటేష్‌ ఉపాధ్యక్షులుగాను, రాజేష్‌కుమార్‌ ప్రధానకార్యదర్శిగాను పుస్తకాన్ని ముద్రించారు. పథకం ప్రకారం పుస్తకంలోని ముందు పేజీలల్లో బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రము ఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బిల్డర్లుతోపాటు ప్రముఖులు లక్షలల్లో విరాళాలు ఇచ్చినట్టు పుస్తకంలో వారంతట వారే రాసుకున్నారు. వాటిని బిల్డర్లకు, వ్యాపార వేత్తలకు, ప్రముఖలకు చూపించి మీరుకూడా విరాళాలు రాయాలంటూ వసూళ్లకు పాల్పడుతు న్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫో ర్స్‌ పోలీసులు పంజాగుట్ట పోలీ సులతో కలిసి ప్రత్యేక నిఘావేశారు. డీసీపీ పీ.రాధా కిషన్‌ రావు ఆదేశాలతో ఇద్దరు నింది తులను అరెస్టు చేశారు. విచారణలో డబ్బుల కోసం తామంతట తామే ప్రముఖలు విరాళాలి చ్చినట్టు పుస్తకంలో రాసు కుని ఆ రిసిప్ట్‌లను ఇతరు లకు చూపించి పెద్దమొత్తంలో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజాగుట్ట ఏసీపీ ఎస్‌.మో హన్‌ కుమార్‌, టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ టీ.శ్రీనాథ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సీ.హరిచంద్రారెడ్డి, ఎస్‌ఐలు బీ.అశోక్‌ రెడ్డి, బీ.అరవింద్‌ గౌడ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love