ప్రజా పాలన కార్యక్రమాల్లో కలెక్టర్‌

నవతెలంగాణ-జహీరాబాద్‌, సదాశివపేట, నారాయణఖేడ్‌రూరల్‌
జహీరాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీల్లో, సదాశివపేట మండల పరిధిలోని ఆరూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో, నారాయణఖేడ్‌ మండ లంలోని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన’ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌కుమార్‌ పాల్గొ న్నారు. ఆరూర్‌లో సర్పంచ్‌ నాయి కోటి మధు, ఆర్డీవో రవీం దర్‌ రెడ్డి, ఎంపీడీవో పూజతో కలిసి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు పద కాలు అమలు కోసం 28వ నుంచి జనవరి 6 వరకు ప్రజల నుంచి దరఖా స్తులను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖా స్తుదారులకు తప్పకుండా రసీదు అందించాలని సంబంధిం చిన అధికారులకు సూచించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. జహీరాబాద్‌లో పలువురు మహిళలు కలెక్టర్‌ వద్దకు వచ్చి.. తమకు ఫారాలు లభించడం లేదని ఫిర్యాదు చేశారు. దాంతో అధైర్య చెందా ల్సిన అవసరం లేదని.. ప్రతీ ఒక్కరికీ ఫారాలు అందుతా యని చెప్పారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు సమయం ఉన్న దని ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఆరూర్‌లో సర్పం చ్‌ నాయికోటి మధు మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వారికి రేషన్‌ కార్డులు మంజూరు చేయా లని కలెక్టర్‌ను కోరారు. అంతేకాకుండా గ్రామంలోని 52 సర్వేనెంబర్‌ గల ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల స్థలాన్ని ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలుగా ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో జహీరాబాద్‌లో ఆర్డీవో వెంకట్‌రెడ్డి, జహీరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సుభాష్‌ రావు, మున్సిపల్‌ సిబ్బంది స్వర్ణకుమారి, సీఐ రాజు, నారాయణఖేడ్‌లో ఆర్డీవో వెంకటేష్‌, డీఎస్పీ వెంకట్‌ రెడ్డి, ఎంపీపీ తనయుడు రమేష్‌ చౌహన్‌, జెడ్పీటీసీ రవీందర్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినోద్‌ పటేల్‌, సర్పంచ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love