హోం ఓటింగ్ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

– నియమించిన బృందాలు నిబద్ధతతో  పనిచేయాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ హోం ఓటింగ్ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు. బుధవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోం ఓటింగ్ నిర్వహణ బృందాలకు  ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రియాంక, అదనపు ఎస్పీ ఎం. నాగేశ్వర రావు లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల సంఘం సూచనల మేరకు 85 సంవత్సరాల వయసు పై బడిన వారికి జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో హోం ఓటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 692 మంది దరఖాస్తులు చేసుకున్నారని, 27 రూట్లు ఏర్పాటు చేశామని అలాగే రూట్లవారిగా 29 బృందాలు ఈ నెల తేదీ. 3.5.2024, 4.5.2024 న హోం ఓటింగ్ చేపడతారని తెలిపారు. అట్టి ఓటింగ్ లో  వివిధ కారణాలతో పాల్గొనక పోతే తదుపరి రెండో సారి తేదీ. 8.5.2024 న చేపట్టడం జరుగుతుందని తెలిపారు.నియమించిన బృందాలకు వాహన సదుపాయం కల్పించడం జరుగుతుందని అలాగే హోం ఓటింగ్ సమయంలో  సమన్వయం, నిబద్ధతతో బృందాలు వ్యవహరించాలని సూచించారు. మే మాసం లో  ఉష్ణోగ్రతలు  అధికంగా  ఉంటున్నందున బృందాలకు గొడుగులు సమకూర్చానున్నట్లు తెలిపారు. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు  హోం ఒటింగ్  వివరాలు తెలపాలని కలేక్టర్ సూచించారు. సెక్టార్ అధికారులు  విధులు నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.అదేవిదంగా గత  అసెంబ్లీ ఎన్నికలలో నియమించిన బృందాలు, ఉద్యోగులు అలాగే అధికారులు సమిష్టి కృషితో పనిచేయడం వలన జిల్లాకు అవార్డు రావడం జరిగిందని అలాగే పది పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 6వ స్థానంలో నిలిచిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.అనంతరం అదనపు ఎస్పీ ఎం. నాగేశ్వర రావు మాట్లాడుతూ హోం ఓటింగ్ కి పోలీస్ ఎస్కార్డ్ ఏర్పాటు చేస్తామని అలాగే    అన్ని సెగ్మెంట్లలో పటిష్ఠ బందోబస్తు కల్పించనున్నాని తెలిపారు.ఈ సమావేశంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ఎఫ్.డి.ఓ రూపెందర్ సింగ్, డి.ఏ.ఓ శ్రీధర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, మాస్టర్ ట్రైనర్లు వి. రమేష్, పి.  వెంకటేశ్వర్లు, సి.హెచ్ శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love