నేడు కలెక్టరేట్‌ ముట్టడి

నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
ఐకెేపీ వీఓఏల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు జరగబోయే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిలో వేలాది మంది ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం వీఓఏల సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐకేపీ వీఓఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి సమ్మెను విరమించే ఆలోచన చేయాలని లేని పక్షంలో ఎలాంటి పోరాటాల కైనా ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఐకెపి విఓఏ పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఏదుల లక్ష్మి, గుడిసె సువర్ణ,వడ్డగాని విజయ, గుడిసె పద్మ,అద్దెల ఉమా, ఉయ్యాల శోభ, సుమలత, వనజ కుమారి, సత్తమ్మ, రాధిక,శ్రీలత,బురుగు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర :విఓఏలను తక్షణమే సెర్పు ఉద్యోగులుగా ప్రకటించాలని జిల్లా విఓఏల యూనియన్‌ అధ్యక్షుడు చిలుముల దుర్గయ్య ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మండల కేంద్రంలో ఆదివారం వీఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మెలో కూర్చొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి.నాయిని లక్ష్మి, గౌరవ అధ్యక్షులు తరి బిక్షమయ్య, ధనలక్ష్మి, సత్యనారాయణ, రామావత్‌ బికోజి, పులిమల రాజేందర్‌, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love