తనకుర్ధి గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభం..

నవతెలంగాణ-  మోపాల్

మోపాల్ మండలంలోని తనకుర్ధి గ్రామంలో జెడ్పిటిసి కమల నరేష్ ఎంపీపీ లతా కన్నిరామ్ తో కలిసి తనకుర్ధి సర్పంచ్ లతా భూషణ్ సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. జెడ్పిటిసి నరేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఎక్కడ చూసినా యే గ్రామంలో చూసిన ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు కానీ ప్రకృతి వనాలు కానీ సిసి రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీ నిర్మాణం కానీ కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మరియు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతోనే ఈ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, అలాగే మన రూరల్ ఎమ్మెల్యే ప్రతీ గ్రామానికి తన ఎస్ డి ఎఫ్ మరియు సిడిఎఫ్ నిధుల నుండి కుల సంఘాల నిర్మాణానికి కాని మరి ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటయించడం జరుగుతుంది,  జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి పథకాలకు తమ నిధులను కేటాయించిన ఎమ్మెల్యే మన బాజిరెడ్డి గోవర్ధన్, తిరిగి మూడోసారి టికెట్ కూడా తనకే రావడం అటువంటి నాయకుడిని అత్యధిక మెజార్టీతోటి మనమందరం కలిసికట్టుగా పని చేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముత్తన్న, మాజీ ఏ ఎం సి డైరెక్టర్  రాజిరెడ్డి, మోసిన్, కిషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ధీరజ్ తదితర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Spread the love