ఆగస్టు 15 సందర్భంగా సూర్యాపేట బాల్ భవన్ లో పోటీలు..

నవతెలంగాణ- సూర్యాపేట
8 వ తరగతి నుండి ఇంటర్ స్థాయి వరకు స్టూడెంట్స్ ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ అంశం మీద మీరే స్వయంగా తయారు చేసుకుని మీ పేరు,మీ స్కూల్ లేదా కాలేజి పేరు, మీ మొబైల్ నెంబర్ రాసి జిల్లా బాల్ భవన్ (జూనియర్ కాలేజి ప్రాంగణంలో) సూర్యాపేట నందు సోమవారం వరకు బాల్ భవన్ పని వేళల ( 12:30 pm – 7 pm) యందు అందజేయగలరు.
అంశం:“మీకు అవగాహనలో వున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ”  మీకు అవగాహన లో వున్న పథకాల పేర్లు రాసి,ఏదేని ఒక పథకం గురుంచి ఈ క్రింద అడిగిన ప్రకారం వివరణ ఇవ్వగలరు.
1.పథకం రాక ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు.
2.పథకం తేవడం వెనుక గల కారణం లేదా ఉద్దేశ్యం వివరణ.
3.పథకం వల్ల ప్రయోజనమా? వివరణ
4. నష్టాలా?వాటి వివరణ.
5.మన సలహాలు సూచనలు.
ఈ అంశాల మీద (తెలుగు లేదా ఆంగ్లము లేదా హిందీ భాషలలో వ్రాయవచ్చు) రెండు పేజీలకు మించకుండా వ్యాసం తో పాటు డ్రాయింగ్ ద్వారా ప్రదర్శన చేయాలి. పోటీలో ఎంపికైన విజేతలకు త్వరలో బహుమతుల ప్రదానం తేదీ అనౌన్స్ చేస్తాము. బహుమతుల ప్రదానం రోజున మీ డ్రాయింగ్ లో ఏమి ప్రదర్శన చేశారో వివరించి తెలపాల్సి వుంటుంది. ప్రభుత్వ ప్రవేటు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజి వారు స్టూడెంట్స్ కి సమాచారం అందించి ఈ పోటీల్లో పాల్గొనేలా చూడగలరు అని,ఎదైనా సహాయం కొరకు మొబైల్ నెంబర్ 9494854468 ను సంప్రదించవచ్చు అని బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి తెలిపారు.

Spread the love