కామ్రేడ్ ధర్మ బిక్షం ఆశయాలను సాధిద్దాం..

నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్: స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ ఎంపీ కామ్రేడ్ బొమ్మ గాని ధర్మ బిక్షం ఆశయాలను సాధించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మ బిక్షం భవనంలో ఆ పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం పాల్గొని మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన అంతందించాలనే ఆలోచనలతో లక్షలాది పేద ప్రజల హక్కులను స్వేచ్ఛను కాపాడాలని, చీకటి జీవితాల నుండి వారిని రక్షించడానికి ఉద్యమించాలని, ఆలోచనలతో దోపిడీ, దౌర్జన్యాలను వెట్టిచాకిరిని, బానిస బతుకును, ఎదిరించడానికి, గుండె ధైర్యంతో, ఉక్కుపిడిక్కులను బిగించి ఉద్యమాలను నడిపిన గొప్ప వ్యక్తి ధర్మబిక్షం అని అన్నారు. దోపిడీ, వెట్టి చాకిరి దొరల, దౌర్జన్యాలు భూసాముల అరాచకాలు వేధింపులు నిర్మూలించ పడాలంటే ప్రజల్లో చైతన్య రావాలని ప్రజల పక్షాన పోరాటాలు చేసిన విప్లవ యోధుడు కామ్రేడ్ ధర్మ బిక్షం అని కొనియాడారు. ఈనెల 26న ఆయన 13 వర్ధంతిని సిపిఐ పట్టణ కమిటీ ఆఫీసులో ఘనంగా జరుగుతాయని ఈ వర్ధంతికి కార్మికులు, కర్షకులు, పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజనలు అభిమానులు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.సిపిఐ పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని శ్రీనివాస్, దోరేపెల్లి శంకర్,చామల అశోక్ కుమార్,నిమ్మల ప్రభాకర్, దీకొండ శ్రీనివాస్, తోట నరసయ్య, బూర సైదులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love