వరద బాధితులకు ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్ చేయూత

– నిత్యవసర సరుకులు పంపిణీ
నవతెలంగాణ -తాడ్వాయి
ఇటీవల విస్తరంగా కురిసిన వర్షాలకు జంపన్న వాగు ఉగ్రరూపానికి నిస్సహాయులైన మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల్లోని నిరుపేద వరద బాధిత కుటుంబాలకు మాజీ దివంగత మంత్రి అజ్మీర చందూలాల్ కుమారుడు, ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీర ప్రహ్లాద్ సోమవారం నిత్యవసర సరుకులు,  దుస్తులు పంపిణీ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఎన్నడు లేని విధంగా జంపన వాగు పొంగిపొరడం ఎంత నష్టం వాటిల్లడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లన్న, స్థానిక ఎంపీపీ గొంది వాణిశ్రీ, ములుగు ఎంపీపీ శ్రీదేవి సుధీర్, ఎంపిటిసి కుక్కల శ్రీను, సర్పంచులు గుర్రం రమా సమ్మిరెడ్డి, మేడారం మాజీ సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, కోఆప్షన్ సభ్యులు దిలావర్ ఖాన్, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, బండారి చంద్రయ్య, ఎనగందుల బాపిరెడ్డి, సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, నాయకులు రంగు సత్యనారాయణ, ఎనుగంటి భద్రయ్య, పిన్నింటి సంజీవరెడ్డి, సుభాష్, లింగమూర్తి, కృష్ణ, గట్టు మహేందర్, కర్ర రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సత్యం, పర్వతాల భరత్, మురళి, ఎలవర్తి శ్రీనివాసరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. కాగా మొదట ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల తో కలిసి మేడారంలోని సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలను దర్శించుకున్నారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సారే సమర్పించి, ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. శాల్కవాలలు కప్పి, అమ్మవార్ల ప్రసాదం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
Spread the love