కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం

–  కాంగ్రెస్ జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు డాక్టర్ సూర్యవర్మ
నవ తెలంగాణ – సిద్దిపేట 
రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని
కాంగ్రెస్ జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు డాక్టర్ సూర్యవర్మ అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు145 రోజులు, 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు  4081 కిలోమీటర్ల భరత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం  ఏర్పాటు చేసిన విదకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ద్వేషాన్ని బట్టబయలు చేసేందుకు రాహుల్ గాంధీ  పాదయాత్ర చేశారన్నారు. పాద యాత్ర నుండి స్ఫూర్తి పొందిన మేము ఖచ్చితంగా దేశ ప్రజల కోసం పని చేస్తామని, రాష్ట్రంలో, కేంద్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మతం, కులాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా విద్వేషాలను ఎలా వ్యాప్తి చేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని అన్నారు. ఈ
కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్షద్‌ హుస్సేన్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి మున్నా, డీసీసీ ఓబీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జంగోని శ్రీనివాస్‌, సీతాబాలు, డీసీసీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి మోతే కుమార్, డీసీసీ ఓబీసీ సెల్ కార్యదర్శి జంగేటి బాల్‌రాజ్ , సిరాజ్‌, రూరల్ ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ రమేష్, నాయకులు రాజు, క్రాంతి, జిత్తు పాల్గొన్నారు
Spread the love