మరికాసేపట్లో కాంగ్రెస్ రెండో జాబితా!

నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. తెలంగాణలో పరిస్థితులు, మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని, బ్యారేజ్ కుంగడంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని ఈసీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. ఈసీని జైరాం రమేష్, మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిశారు.

Spread the love