కాంగ్రెస్‌ వైఫల్యాలు…కమల వికాసం!

Congress failures... Kamala Vikasam!ఇటీవల తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌్‌, ఈశాన్య రాష్ట్రం మిజోరం శాస నసభలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తామని ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్‌ కూడా వారి ని వరించలేదు. అంతేగాక ఇప్పటివరకు కాం గ్రెస్‌ ఏలుబడిలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో కూడా కాషాయం పార్టీ విజయకే తనం ఎగురవేసింది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వాన బొటాబొటి మెజారిటీతో అధికారం లోకి రావడం కాంగ్రెస్‌కు కొంత ఊరట. 40 అసెంబ్లీ స్థానాలు గల ఈశాన్య రాష్ట్రం మిజోరంలో లాల్‌ దుహౌమా నేతత్వంలోని జోరాంగ్‌ పీపుల్స్‌ మూవ్మెంట్‌ అధికార మిజో నేషనల్‌ఫ్రంట్‌ను ఓడించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జోరం పీపుల్స్‌ మూవ్మెంట్‌ పార్టీ 27 స్థానాలు గెలవగా ఎంఎన్‌ఎఫ్‌కు 10స్థానాలు, బీజేపీకి కేవ లం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ శాసనసభ 119 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 64 స్థానాలు మిత్రపక్షం సీపీఐ ఒక్క స్థానం గెలిచాయి. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక గత పదేళ్లుగా తిరుగులేని అధికారం చెలాయించిన కెేసీఆర్‌ నాయ కత్వంలోని బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలు, ప్రజా స్వామ్య వ్యతిరేక ఏకవ్యక్తి నియంతత్వ, అహంకారపూరిత కుటుంబ పాలనను ముఖ్యంగా కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన వేలకోట్ల అవినీతిని, విద్యుత్‌ కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల ధన దుర్వినియోగాన్ని సమర్థవంతంగా ఎండ గట్టి రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిం ది. ఆ వెంటనే హస్తం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఆర్టీసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం,రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సౌకర్యం పరిమితిని రూ.10 లక్షలకు పెంచి ప్రజల మన్ననలను అందుకుంది. ఇక పెద్ద హిందీ రాష్ట్రాలు రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌లలో విజయ సాధనకు కమలనాథులు పకడ్బందీ ముందస్తు వ్యూహంతో కొన్ని నెలల ముందు నుండే బూత్‌ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి కమలం శ్రేణులను, నేతలను ఎప్పటికప్పుడు అప్ర మత్తంచేస్తూ చెమటోడ్చారు. ఆదివాసీనేత బర్శముండా జయంతి రోజున ఆదివాసీలలో బాగా వెనుకబడిన వర్గాల బతుకులను మెరుగుపరచడానికి నవంబర్‌ 5న రూ.24,104 కోట్లు ఖర్చయ్యే ” ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ అభియాన్‌” అనే పథకాన్ని ప్రకటించడం ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ఆదివాసీలు కమలం పార్టీ వైపూ మొగ్గేలా చేసింది ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న రేషన్‌ పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించడం వల్ల కూడా పేదలు ”పువ్వు” పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. రాజస్తాన్‌, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో కాంగ్రెస్‌, బీజేపీలు హోరాహోరీగా తలపడినా గెలుపు కమలం పార్టీనే వరించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 48.55శాతం ఓట్లు రాగా, ఛత్తీస్‌గఢ్‌లో 46.27 శాతం, రాజస్థాన్‌లో 41.7 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ పార్టీకి మధ్యప్రదేశ్‌లో 2018 ఎన్నికలలో 40.89 శాతం ఓట్లు రాగా ఈసారి స్వల్పంగా తగ్గి 40.40శాతం ఓట్లు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌్‌లో 2018లో 43.04 శాతం ఓట్లు రాగా ఈసారి 42.23 శాతానికి తగ్గాయి. రాజస్తాన్‌లో 2018లో కాంగ్రెస్‌ పార్టీకి 39.3 శాతం ఓట్లు రాగా ఈసారి అవి39.5 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్‌ ఆరోగ్య బీమాను రూ.50 లక్షలకు పెంచినా, ఎన్నో జన సంక్షేమ పథ కాలు అమలు చేసినా ఐదేళ్ల కోసారి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే సంప్రదాయాన్ని ప్రజలు పాటించారు.
మూడు హిందీ రాష్ట్రాలు రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ ఛత్తీస్‌ గడ్‌లలో కమలం పార్టీకి ఏడెనిమిది నెలల క్రితం వరకు ఏమం త అనుకూల పరిస్థితులు లేవు. కర్నాటకలో పరాజయం తర్వాత యూపీ, బీహార్‌ తర్వాత పెద్ద హిందీ రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ప్రతికూలత ఉన్నట్లు సంకేతాలు రావడంతో కమలనాథులు ఏడె నిమిది నెలల ముందే జాగ్రత్త పడుతూ వచ్చారు.బూత్‌ స్థాయి నుండిపై స్థాయి వరకు బాధ్యులను నియమించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి దిద్దుబాటుకు యత్నించారు.ప్రధాన హిందీ రాష్ట్రాలలో ఓడితే వచ్చే మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో నెగ్గుకు రావడం కష్టమని కమలనాథులకు అవగతమైంది. అం దుకే ప్రధానిమోడీ అన్నీ తానై,అంతటా తానై ప్రచార యుద్ధం సాగించారు. 2018లో ఆయా రాష్ట్రాల నేతలకు ఎన్నికల బాధ్య తలు అప్పగించి పరాజయం పాలైన సంగతి గుర్తించి ఈసారి అభ్యర్థుల ఎంపిక సహా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసు కున్నారు. తాము అధికారంలోకి వస్తే ”కులగణన” చేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించడంతో మోడీ అప్రమత్తమయ్యారు. బీజేపీ తన మాతృసంస్థ ఆరెస్సెస్‌ నుండి సైద్ధాంతిక దన్ను, ఆది వాసీలలో స్వచ్చంద సంస్థల ద్వారా చేస్తున్న సంక్షేమ కార్యక్ర మాలు ఓట్ల శాతాన్ని మెరుగు పరచుకోవడానికి తోడ్పడ్డాయి. సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు ఓటేసే దళితులు,ఆదివాసీల ఓట్ల కోసం కమలనాథులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఇతర లౌకిక పార్టీలు సంస్థాగతంగా బలపడి చేరువ కాకపోతే బీజేపీ క్రమక్రమంగా వారికి దగ్గరయ్యే అవకా శాలే ఎక్కువ. ఈ వైఫల్యాలను పార్లమెంట్‌ ఎన్నికల్లోపు కాంగ్రెస్‌ అధిగమించాలి. ‘ఇండియా’ కూటమి ద్వారా ప్రజలకు చేరువ య్యే మార్గాలను అన్వేషించాలి. లేదంటే భారతదేశ చిత్ర పటం కాషాయపు రంగులోకి మారే ప్రమాదం పొంచివుందన్న సంగతి మరువరాదు.

Spread the love