జూనియర్ కళాశాల ప్రారంభానికి పరిశీలన

నవతెలంగాణ కమ్మర్ పల్లి

మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎల్. రఘురాజ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఉన్నత పాఠశాలలో గదులను పరిశీలించారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎల్. రఘురాజ్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లను తీసుకుంటున్నామని తెలిపారు. ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఈసి తెలుగు, ఇంగ్లీష్ మీడియం లలో అడ్మిషన్లు ఈనెల 25వ తేదీ నుండి తీసుకుంటామని తెలిపారు.ఇప్పటివరకు ఏ కళాశాలలో అడ్మిషన్ పొందని వారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కళాశాలను కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ రెడ్డి, ఇంచార్జి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, సి అర్ పి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love