ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం

– సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

– సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
ప్రజ సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తు ప్రజలకు వెన్నంటి ఉంటామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో సీపీఐ పార్టీని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలని  సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని  డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామపంచాయతీ సిబ్బందికి ఒక్కొక్కరికి 8000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారని వాస్తవానికి ఒక్కొక్క సిబ్బందికి 5000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి పారిశుద్ధ్యం మీద అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ ,వివిధ మండల కార్యదర్శులు కొమ్ముల భాస్కర్, ముంజ గోపి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, జాగీర్ సత్యనారాయణ, కనుకుట్ల శంకర్,కొయడ సృజన్ కుమార్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, అయిలేని మల్లారెడ్డి,బూడిద సదశివ తదితరులు పాల్గొన్నారు.
Spread the love