
– మంతెన చిరంజీవి మాదిగ
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ మాదిగ జాతి ని మోసం చేసిందని మూడు ఎస్సీ రిజర్వుడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించలేదని అందుకు మాదిగ జాతిని సన్నద్దం చేయడానికిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈనెల 22న ఉదయం 10 గంటలకు పెద్దపల్లి లోని ఆర్కే గార్డెన్ కి విచ్చేయుచున్నారు. కావున ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు మరియు మాదిగలు మరియు మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటారం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంతెన చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో కోరారు.