కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు శిలాఫలకానికే పరిమితం

– నిధులు మంజూరైనట్లా లేక తూతూ మాత్రమేనా
– పనులు జరగకపోవడం గ్రామ ప్రజల్లో అనుమానాలు, శిలాఫలకం వేసి మూడు నెలలు పూర్తి
– హడావుడి అంతా ఎన్నికల కోసమేనా
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు నిర్మాణం అభివృద్ధి కోసం తొమ్మిది కోట్ల నిధులు మంజూరైనట్లు అప్పటి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనుల కోసం అక్టోబర్ 4న శిలాఫలకం వేసి భూమి పూజ చేశారు. ఈ సెంట్రల్ లైటింగ్ రోడ్డు అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం అయ్యాయి అప్పటి ఎమ్మెల్యే సెంటర్ లైటింగ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి మూడు నెలలు కావస్తున్న పనులు మాత్రం జరగకపోవడం అసలు నిధులు మంజూరైనట్ల కానట్లేనా ఎన్నికల టెంట్గా హడావుడి చేసినట్లా ఈ విధమైన చర్చలు మద్నూర్ గ్రామ ప్రజల్లో జోరుగా వినబడుతున్నాయి. శిలాఫలకానికి అప్పటి ఎమ్మెల్యే హనుమంతు సిండే పూజలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ సురేష్ ప్రోక్లింగ్ ద్వారా సెంట్రల్ లైటింగ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు. శిలాఫలకానికి అప్పటి ఎమ్మెల్యే భూమి పూజ చేయగా గ్రామ సర్పంచ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రోక్లింగ్ ద్వారా ప్రారంభించడం జరిగింది. మూడు నెలలు కావస్తున్న రోడ్డు పనులు శిలాఫలకానికే పరిమితం కావడం గ్రామ ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇదంతా ఎన్నికల టెంట్గా హడావుడి చేశారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందర కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినా కూడా అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం కావడం సెంటర్ లైటింగ్ రోడ్డు అభివృద్ధి పనుల పట్ల స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ సభ్యులు మండల ఎంపీపీ మండల జడ్పిటిసి సభ్యులు గతంలో శిలాఫలకం భూమి పూజలో పాల్గొన్నప్పటికీ అభివృద్ధి పనుల పట్ల ఏమాత్రం చొరవ చూపకపోవడం సెంట్రల్ లైటింగ్ రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు. అయినట్లేనా లేక ఆ నిధులకు సంబంధించిన టెండర్లు పడలేకపోయాయా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అభివృద్ధి పనుల పట్ల ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని మద్నూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Spread the love