Sunday, May 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​సింగిల్ విండో చైర్మెన్లను కొనసాగించండి

​సింగిల్ విండో చైర్మెన్లను కొనసాగించండి

- Advertisement -


గవర్నర్‌‌ శివ ప్రతాప్ శుక్లా కు బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి
​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని సింగిల్‌ ‌విండో చైర్మెన్లను కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ గవర్నర్‌‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష‍ నేత మధుసూధనాచారి నేతృత్వంలో సహకార చైర్మెన్లతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌‌లోని లోక్‌‌భవన్‌‌లో గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు. ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. 2020లో గెలిచిన చైర్మెన్లకు 2025 వరకు పదవి కాలం ఉందనీ, ఆ తర్వాత వారిని కొనసాగించించారని గుర్తు చేశారు. ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్‌ ‌పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని నామినేట్ చేయాలని చూడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్‌ ‌విండో చైర్మెన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్తామని గవర్నర్ హామీ ఇచ్చారని అనంతరం మధుసూధనాచారి మీడియాకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -