నవతెలంగాణ – భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హైరా నుంచి చైన్నె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు.