అవినీతి నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి..

నవ తెలంగాణ ఆర్మూర్ 
అవినీతి నాయకులను ఓటుతో సాగనంపాలని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మిర్దపల్లి, రాంపూర్, ఇస్సాపల్లి, గుత్ప, దేగాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం అని చెప్పి న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కాని నిరుద్యోగ యువతకు పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని అన్నారు, దళిత బంధు జాడ లేదు అని ఊరికి రెండు వందల దళిత కుటుంబాలు ఉంటే ఒక్కరికీ మాత్రమే దళిత బంధు ఇచ్చి దగా చేసాడు అని అన్నారు, ఈ గ్రామాల్లో గుత్ప, దేగాం ఎత్తిపోతాల ద్వారా సస్యశ్యామలం చేసాం అని అన్నారు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియేంబర్స్ మెంట్, మోడల్ స్కూల్స్, వంటి పథకాలు తెచ్చాం అని అన్నారు, ధరణి తొ రైతులు అందరిని ఇబ్బందులకు గురి చేసాడు అని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తాం అని అన్నారు, జీవన్ రెడ్డి 100 కోట్లతొ షాపింగ్ మాల్  కట్టుకున్నాడు కాని ప్రజలకు డబుల్ బెదురూమ్ ఇళ్ళు కట్టివ్వలేదు అని జీవన్ రెడ్డిని తరిమికొడితేనే మీకు ఇళ్ళు వస్తాయి అని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని అన్నారు, ఈ సందర్భంగాసీనియర్ నాయకులు మార చంద్రమోహన్, యాల్ల సాయరెడ్డి లు మాట్లాడుతూ సోదరుడు వినయ్ రెడ్డి ని బల పరిచి భారీ మెజారిటీతొ గెలిపించాలి అని కోరారు. మండలంలోని రాంపూర్, మిర్దాపల్లి, ఇస్సాపల్లి గ్రామాల్లో మహిలాలు యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి వినయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . కార్యక్రమంలో నాయకులు కోలా వెంకటేష్, పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, దూదిగాం ప్రమోద్, విట్టం జీవన్, సాయిబాబ గౌడ్, చిన్నారెడ్డి, ముక్కెర విజయ్, మధు, శంకర్, శ్రీనివాస్, మల్లరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love