మొదలైన ఈవీఎం ఓట్ల లెక్కింపు…

నవతెలంగాణ – హైదరాబాద్:  ఏపీలో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైసీపీ నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే సమయంలో, టీడీపీ అభ్యర్థులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ లో రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2,870 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. మరో వైపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.

Spread the love