సీపీఐ నారాయణకు అస్వస్థత

నవతెలంగాణ – హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ అస్వస్థతకు గురయ్యారు.. రిబ్ ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు రెండు వారాల విశ్రాంతి సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న కామారెడ్డిలో జరిగిన ఓ వివాహ వేడుకలో జారిపడ్డారు. అప్పటికి పెద్దగా ఇబ్బంది కలగకపోవడంతో అశ్రద్ధ చేశారు. అనంతరం విశాఖపట్నం, చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స చేసి పంపిస్తూ.. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నారాయణ తెలిపారు.
Spread the love