పోరాటాల ద్వారానే హక్కులు సాధన: సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
పోరాటాల ద్వారానే కార్మికుల హక్కులు సాధించు కోవచ్చునని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు.శనివారం స్థానిక మూడు రోడ్ల కూడలిలో గత 17 రోజులుగా నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ జేఏసీ కార్మికుల సమ్మె శిభిరాన్ని సందర్శించి  పార్టీ తరుపున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు గతంలో కాంగ్రెస్ పార్టీ తరువాత తెలుగుదేశం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. కార్మికుల కనీస వేతనం అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యాయని,ఒకపక్క నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల మరోపక్క పని భారం, చాలీచాలని జీతాలుతో కార్మికులు అర్ద ఆకలితో రోజులు గడుపుతున్నారని ఆయన ఆవేదన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో గ్రామపంచాయతీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామపంచాయతీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను విజయవంతంగా జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ అధికారులు కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా పాలక పక్షాలు కార్మికుల న్యాయమైన డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం మల్టీ పర్పస్ విధానం రద్దు చేయడం, కనీస వేతన చట్టం ప్రకారం రూ.26 వేల రూపాయలు ఇవ్వటం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, అర్హులైన బిల్ కలెక్టర్ లకు సహాయ కార్యదర్శిలుగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
   ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య, కేసుపాక నరసింహారావు, మండల గౌరవ అధ్యక్షులు మట్లకుంట కామేశ్వరరావు, మూల అప్పన్న, నాగేంద్ర, మురళి, కట్టా శ్రీను, రాజపుత్ర రంజిత్ సింగ్(నందు), వేలేటి నాగభూషణం, నరేంద్ర, వరలక్ష్మి, దీనమ్మ, రూపమ్మ, రాణి, బద్దె లక్ష్మి, అలివేలు, తిరుపతమ్మ, కుమారి, నాగమణి, స్వప్న, పద్మ, రమాదేవి, పి.నాగమణి, మహేష్, పిచ్చయ్య, గంగయ్య, రాజు, గుర్రాల దుర్గయ్య, నల్లబోతుల జ్యోతి, తగరం రాంబాబు, మరియమ్మ, బాబురావు, సత్యనారాయణ తదితర కార్మికులు పాల్గొన్నారు.
Spread the love