పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – మునుగోడు
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మికులకు , రైతులకు రక్షణ లేకుండా హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు వంతపడే విధంగా చట్టాలను తెచ్చి పేద ప్రజల నడ్డి విరిసిన బీజేపీ కి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కార్మికులకు కర్షకులకు రైతులకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం  పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కల్వలపల్లి  గ్రామంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్  ప్రచారం  లో భాగంగా ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యల మీద కమ్యూనిస్టులు చేసే పోరాటాలను ఉపాధి కూలీలకు వివరించారు . బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నల్ల చట్టాలను తెచ్చి పేద ప్రజల నడ్డి విచ్చే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన ఎర్రజెండా అండగా ఉండి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే సీపీఐ(ఎం) ను ఆదరించి బోనగిరి గడ్డపై సీపీఐ(ఎం) జెండా  ఎగరవేసేందుకు పేద ప్రజలు , రైతులు, కార్మికులు కర్షకులు ఏకమవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఎన్నిక ప్రజల పక్షాన పోరాడే ప్రజా నాయకులకు… ప్రజల్ని మోసం చేసేందుకు  డబ్బుల సంచులతో  వచ్చే నాయకులకు మధ్య జరిగే యుద్ధం అని అన్నారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం)  భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మునుగోడు మండల నాయకులు మిర్యాల భరత్, సాగర్ల మల్లేష్, శివర్ల వీరమల్లు,వంటపాక అయోధ్య ,మాజీ సర్పంచ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love