22 రోజులుగా కొనసాగుతున్న సిపిఐఎం భూ పోరాటం

నవతెలంగాణ – కంటేశ్వర్
సిపిఐఎం నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన భూ పోరాటం 22వ రోజుకు చేరుకుంది. రెక్క ఆడితే గాని డొక్కాడని ప్రజలు నిలువ నీడ కోసం ఉపాధి పనులు మాని 22 రోజులుగా గుడిసెలు వేసుకొని రాత్రింబవళ్లు సిపిఐఎం ఇచ్చిన స్ఫూర్తితో గుడిసె స్థలాల్లోనే గడుపుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి పెద్ది సూరి అధ్యక్షతన భూ పోరాట స్థలంలో ప్రజలతో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ , ఎస్వీ రమ , హాజరై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాటాల గురించి ఉద్యమించాల్సిన విధానం పోరాటాల ఫలితాల గురించి ప్రజల్లో ఉత్సాహం కలిగించే విధంగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలుచుకోవాలంటే ముందు ప్రజా సమస్యలను పట్టించుకోవాలని ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన భూమి హక్కును అందరికీ కల్పించాలని ఇళ్ల స్థలాలను ఇస్తూ ఇండ్లు నిర్మించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 10 లక్షల రూపాయలు ఉచిత రుణాలను ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, పార్టీ సెక్రటేరియట్ సభ్యులు మల్యాల గోవర్ధన్, పార్టీ నగర కమిటీ సభ్యులు కృష్ణ, అనసూయ, మహేష్, పాల్గొన్నారు.

Spread the love