రవీంద్రభారతిలో ఇందూరు కవులు ఘనపురం, డా.కాసర్ల కు ఘనసన్మానం

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవిసమ్మేళనంలో , ఇందూరు కవులు ఘనపురం దేవేందర్, డా.కాసర్ల నరేశ్ రావులకు ఘనసత్కారం పొందారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి కవిసమ్మేళనంలో మొదటి విభాగంలోని పద్యకవితాసదస్సులో డా.కాసర్ల నరేశ్ రావు తెలంగాణను నేను అనే శీర్షికతో పద్యాలను వినిపించారు. తర్వాతి సభలో ఘనపురం దేవేందర్ ఇంద్రభయంకరుడు అనే వచనకవితను వినిపించారు. వీరిద్దరినీ తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షలు అయాచితం శ్రీధర్, శాసనమండలి సభ్యులు వాగ్గేయకారులు గోరేటి వెంకన్న, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ ఘనంగా సత్కరించారు. ఈ సభలో కవులు,కళాకారులు పాల్గొన్నారు.రాష్ట్ర స్థాయిలో ఇందూరు కవుల ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో పెంచిన ఇందూరు ఇద్దరు కవులను జిల్లా కవులు,కవయిత్రులు డాక్టర్ త్రివేణి, మల్లవరపు చిన్నయ్య, పంచ రెడ్డి లక్ష్మణ్, చందన్ రావు, కర్క రమేష్,సాయి బాబు, కళ గోపాల్ లు అభినందించారు.

Spread the love