కుప్పకూలిన సుఖోయ్‌ యుద్ధ విమానం..

Sukhoi Fighter Jetన‌వ‌తెలంగాణ – ఢిల్లీ: సుఖోయ్‌ యుద్ధ విమానం కుప్పకూలింది. మహారాష్ట్ర నాసిక్‌లోని షిరస్‌గావ్‌ గ్రామ సమీపంలోని పొలంలో ఈ ఫైటర్‌ జెట్‌ నేలకూలింది. అయితే ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని.. పైలట్‌, కో- పైలట్‌ ఇద్దరూ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈవిషయాన్ని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. సుఖోయ్‌ విమానానికి వింగ్‌ కమాండర్‌గా బోకిల్‌, సెకెండ్‌ ఇన్‌ కమాండర్‌గా బిస్వాస్‌ ఉన్నారు. నాసిక్‌లోని ఓజర్‌ నుంచి విమానాన్ని టేకాఫ్‌ చేశారు. మధ్యాహ్నం 1:20 గంటలకు షిరస్‌గావ్‌ గ్రామంలోని పొలంలో ఒక్కసారిగా ఈ జెట్‌ కూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగి చుట్టూ పొగలు కమ్ముకున్నాయి. వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పైలట్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఈ విమానం భారత్‌ వైమానిక దళం జాబితాలో లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Spread the love